23, నవంబర్ 2025, ఆదివారం

 ఈ మధ్యలో  నేను ఆరు వారాల పాటు జరిగిన Winter Roses Online Painting Workshop  లో చేరాను .UK కిచెందిన 

Artist ,Artteacher అయిన Paul Foxton శిక్షణ ఇచ్చారు . 
         మామూలుగా వివిధ రకాల పూలు పెయింట్  చేయడం కన్నా రోజా పూలు పెయింట్ చేయటం  అనేది చాలా తేడాగా అనిపించింది నాకు  .నాకు అనిపించిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నా ఇక్కడ .
 
  రోజా పూలు వేయాలంటే 

 - మొదట  డ్రాయింగ్  accurate గా వేసుకోవాలి . డ్రాయింగ్ సరిగ్గా లేకపోతే బొమ్మ ముందే రాదని  చెప్పచ్చు.  
 - లోకల్ కలర్ ని  జాగ్రత్తగా మ్యాచ్ చేయాలి 
 - values ని కరెక్టుగా నిర్వచించుకొని ,ఆ రంగులని  accurate గా కలుపుకోవాలి . values ని ముందు work చేయాలి .values ద్వారానే light and shadows ని గుర్తించగలం .
-  ఆ క్రమంలో రంగుల గాఢత(chroma ) తగ్గకుండా జాగ్రత్తపడాలి 
-  తర్వాతనే details కి పోవాలి . ఇందులో underpainting  ఆరనిచ్చి ఆరనిచ్చి మూడు లేక నాలుగు దఫాలుగా పని చేయాల్సి వచ్చింది నాకు .  
- . డీటెయిల్స్ ,high lights చివరి దఫా లో  చేయవచ్చు !
- అలానే రంగుల merging ,edges handling లో జాగ్రత్తపడాలి  !

           రోజాపూలు పెయింట్  చేయటంలో ఇంకా  నైపుణ్యం సాధించాలంటే నిబద్దతతో   చాలా ఏండ్లు దీని పైనే పని  చేయాలి అని అర్థమయ్యింది . నేను వేసిన మరిన్ని రోజా పూల పెయింటింగ్స్ చూడటం కోసం మెనూ లోని roses పేజీకి వెళ్ళండి.  అభిప్రాయాలు తెలియచేస్తే సంతోషపడతాను ! మీకు ముందస్తు కృతజ్ఞతలు !

           అలా రోజాపూల పైనే జీవితకాలం పనిచేస్తున్నకొద్ది మంది నాకు తెలిసిన  ఆర్టిస్టులు వీరు. Kathleen speranza, Katie g.whipple ,Dennis perrin . వాళ్ళ వర్క్స్ చూస్తే ఎంత పని చేయాలో కదా  అనిపిస్తుంది. కింది లింక్ లో paul foxton రోజా పూవును పెయింటింగ్  చేస్తున్న వీడియో మీకోసం  .  
 

 Value study-Value scale 


నేను తెలుసుకున్న  value study గురించి ఇక్కడ కొద్ధి మేరకు చెబుతాను . 
మాములుగా Hue ,Value ,Chroma గురించి  కొంత అర్థం చేసుకోవాలి . 
The Hue అంటే రంగు పేరు ,నీలిరంగు,ఎరుపురంగు ,పసుపురంగు ఇలా . 
The Value అంటే  ఎంత dark గా ఉంది ఎంత light గా  ఉంది ఆ రంగు అనేది 
The Chroma అంటే ఆ రంగు ఎంత బలంగా ప్రభావితంగా  ఉంది ఎంత బలహీనంగా ఉంది అంటే   intensity of color గురించి చెప్పటం. A low  intensity రంగు అంటే grey కి దగ్గరగా ఉండటం,neutral కి దగ్గరగా ఉండటం  A high intensity color అంటే  చాల strong గా pure గా ఉండటం . 

            రియలిస్టిక్  బొమ్మలు వేసేటప్పుడు valuesని సరిగ్గా  వేయడంలోనే తప్పులు ఎక్కువ జరుగుతుంటాయి.ఒక బొమ్మలో అంటే portraits కానీ ,landscapes కానీ వేసేటప్పుడు   depth ని , three dimensionality  ని తీసుకురావాలంటే values ద్వారానే సాధ్యపడుతుంది . మాస్టర్ ఆర్టిస్టులు వాళ్ళ చూపు ,focus మెరుగు పరుచుకోటానికి ఈ అభ్యాసాన్నిమధ్య మధ్యలో చేస్తూనే ఉంటారు . 
           నేను కూడా చాలా రోజులు దీన్ని అర్థం చేసుకోను కష్టపడ్డాను . valuesని అర్థం చేసుకోను  ఫండమెంటల్స్ దగ్గరనుంచి ప్రాక్టీస్ చేయాలి. white నుంచి black వరకు ఉన్నvalues ని చూడగలగాలి .అంటే light to dark మధ్యలో ఉన్నషేడ్స్ ని చూడటం . మొదట పెన్సిల్తో  value scale ని ప్రాక్టీస్ చేయాలి. Value scale ఒక క్రమ పద్దతిలోvalues ని అంటే shades ని  చూడటం నేర్పిస్తుంది . రంగులతో బొమ్మలు వేసేటపుడు ఈ స్టడీ ఎంతగానో ఉపయోగ పడుతుంది . 
           మొదట మూడు values అంటే black ,mid gray ,white ని ప్రాక్టీస్ చేయాలి . తర్వాత ఐదు values ,తర్వాత తొమ్మిది values చేయాలి. ఇది చాలా simple గా  కనిపిస్తుంది.  కానీ చాలా ధ్యానంతో నెమ్మదిగా కావాలంటే రోజుకు ఒక block మాత్రమే నింపుతూ పని చేయాలి .హడావుడిగా speed గా చేయకూడదు texture లు లేకుండా smooth గా టోన్ ఉండాలి . అప్పుడే ప్రతి step లో values ని కరెక్ట్ గా అంచనా వేయగలము , soft pencil  2B, hard pencil 2h తో కానీ    , 6B,B,H,3H  పెన్సిళ్ళతో కానీ పని చేయచ్చు. శ్రద్ద ,నేర్చుకోవాలన్న తపన ఉంటే రకరకాల పెన్సిళ్ళతో ,ఇతర mediums తో కూడా ఈ అభ్యాసం చేయ వచ్చు . బొమ్మల విషయంలో మనం చూసే చూపు మారాలన్నా ,focus దెబ్బ తిన్నా  మళ్ళీ మళ్ళీ ఈ అభ్యాసంచేయాల్సి ఉంటుంది . కింద ఇచ్చిన కొన్ని లింక్స్ లో ఈ ఎక్సరసైజ్ ఎలా చేస్తారో చూడచ్చు .